Ambati Rambabu: పథకాలు ఎగ్గొట్టేందుకు జగన్‌పై బురదజల్లే ప్రయత్నం 1 y ago
AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మోసపూరితమన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. బడ్జెట్‌కు సంబంధించి వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. 143 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, బడ్జెట్‌లో అరకొరగా మాత్రమే నిధులు కేటాయించారని, మరి కొన్ని పథకాలకు అయితే కేటాయింపులే లేవని చెప్పారు. రాష్ట్ర అప్పులపై ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ పథకాలు ఎగ్గొట్టేందుకు జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఏమయ్యాయని అంబటి ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఇస్తామన్నపింఛను ఏమయ్యాయని నిలదీశారు. వైసీపీ హయాంలో 66 లక్షల మందికి పింఛన్లు అందజేశామని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 62 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉద్యోగాల విషయంలో ప్రజలను మోసం చేశారని తెలిపారు. హామీలు అమలు చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.